ప్రభుత్వం అమలు చేస్తున్న చేపపిల్లల పంపిణీ పథకాన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రమాణాలకు అనుగుణంగా చేపపిల్లల్ని అందించకపోతే... వెనక్కి పంపాలని ఆయన మత్సకారుల్ని కోరారు. వనపర్తి జిల్లా మదనపురం మండలం సరళాసాగర్ జలాశయంలో... మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి.... 8లక్షల 20వేల చేపపిల్లల్ని వదిలారు.
అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రారంభించారు. సరళాసాగర్‌లో చేపల ఉత్పత్తి కేంద్రాన్ని పునరుద్ధరించాలని సూచించారు. దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి విన్నపం మేరకు.. భూత్పూర్లో చేపల మార్కెట్, దేవరకద్రలో పశువైద్య నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత ఆధికారులకు ఆయన సూచించారు.
ఇవీచూడండి: ఎల్ఆర్ఎస్కు భారీ సంఖ్యలో దరఖాస్తులు