ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 17 మున్సిపాలిటీలుండగా 338 వార్డులకు 2960 మంది అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు.
మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం రెండు మున్సిపాలిటీలుండగా 692 నామినేషన్లు దాఖలయ్యాయి. మహబూబ్నగర్లో 602, భూత్పూర్లో 90 మంది అభ్యర్థులు పత్రాలు సమర్పించారు.
నారాయణపేట జిల్లాలో మూడు మున్సిపాలిటీలకు 576 మంది బరిలో నిలిచారు. నారాయణపేటలో 151, మక్తల్లో 255, కోస్గిలో 170 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
వనపర్తి జిల్లాలో 5 మున్సిపాలిటీలకు 813 మంది అభ్యర్థులు పత్రాలు సమర్పించారు. వనపర్తిలో 408, కొత్తకోటలో 143, పెబ్బేరులో 93, ఆత్మకూరులో 74, అమరచింతలో 95 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
నాగర్కర్నూల్ జిల్లాలో 3 మున్సిపాలిటీలకు 615 నామినేషన్లు దాఖలయ్యాయి. నాగర్కర్నూల్లో 223, కల్వకుర్తిలో 174, కొల్లాపూర్లో 218 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో 4 మున్సిపాలిటీలకు 492 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. గద్వాలలో 217, అలంపూర్లో 81, వడ్డేపల్లిలో 55 మంది పత్రాలు దాఖలు చేశారు.
ఇవీ చూడండి: పురపోరుకు సై అంటున్న రియల్టర్లు