వనవర్తి జిల్లా మదనాపురం మండలం తీర్మాలయపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఇవాళ ఆదివారం కావటం వల్ల గ్రామానికి చెందిన ధర్మన్న అనే వ్యక్తి బీమా ఫేస్-2 కాలువలో చేపల వేటకు వెళ్లాడు. చేపలకు వల వేస్తుండగా ఆ వల కాళ్లకు చుట్టుకోని నీటిలో మునిగి మృతి చెందాడు.
కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నట్లు గ్రామస్థులు వెల్లడించారు. అతని మరణంతో కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.