ETV Bharat / state

Police: బంధువులు కరవై.. పోలీసులే ఆ నలుగురై! - అనాథ వృద్ధురాలి మృతదేహం

లాక్​డౌన్ వేళ పోలీసులు మంచి మనసును చాటుకున్నారు. ఓ వైపు విధులు నిర్వహిస్తూనే మానవత్వం చూపించారు. వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రంలో ఓ అనాథ వృద్ధురాలి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి గొప్ప మనసు చాటుకున్నారు.

The funeral of an orphaned old woman done by police
వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రంలో అనాథ వృద్ధురాలి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన పోలీసులు
author img

By

Published : May 29, 2021, 8:08 AM IST

Updated : May 29, 2021, 10:18 AM IST

లాక్‌డౌన్‌ వేళ ఓ వైపు క్షణం తీరిక లేకుండా విధులు నిర్వర్తిస్తూనే.. మరోవైపు ఓ అనాథ వృద్ధురాలి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు పోలీసులు. వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రానికి చెందిన శకుంతల(83) అనారోగ్యంతో బాధపడుతూ గురువారం అర్ధరాత్రి మృతి చెందింది. పూరి గుడిసెలో నివసిస్తున్న ఆమెకు నా అనే వారే కరవయ్యారు.

కరోనాతో మరణించిందేమోనన్న అనుమానంతో ఆ వృద్ధురాలి మృతదేహాన్ని తరలించడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఎస్సై తిరుపాజీ.. శిక్షణ ఎస్సై రాజశేఖర్‌, సిబ్బంది కురుమన్న గౌడ్‌, రవికుమార్‌, శివకుమార్‌రెడ్డి, స్వాములు, అబ్దుల్‌ కలాంతో కలిసి ఆ అనాథ వృద్ధురాలి శవాన్ని పాడెపై శ్మశానానికి మోసుకెళ్లి ఖననం చేశారు. అన్నీ తామై అనాథ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన పోలీసులను పలువురు ప్రశంసించారు.

వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రంలో అనాథ వృద్ధురాలి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన పోలీసులు

ఇదీ చూడండి: Drinking Water Bill: కరోనా సమయంలో జలమండలి నుంచి భారీ మొత్తంలో

Last Updated : May 29, 2021, 10:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.