ఉపాధ్యాయులంతా... ఉత్తమములేనన్నారు వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని వనపర్తి జిల్లాలోని 40 మంది ఉత్తమ ఉపాధ్యాయులను పాలనాధికారి శ్వేతా మహంతి ఘనంగా సన్మానించారు. కేవలం అవార్డు గ్రహీతలు మాత్రమే ఉత్తమ ఉపాధ్యాయులు అనుకోకూడదని కలెక్టర్ అన్నారు. జిల్లాలో 63 శాతం మంది ప్రభుత్వ బడుల్లో... 30 శాతం ప్రైవేటు బడుల్లో విద్యాబుద్ధులు చేర్చుకుంటున్నారని కలెక్టర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ లోకనాథ్ రెడ్డి, జిల్లా విద్యాధికారి సుశీంద్రరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: పుట్టిన రోజు కేకులో విషం... ఇద్దరు మృ