వనపర్తి పురపాలికలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పర్యటించారు. స్వచ్ఛ భారత్-స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా మంజూరైన స్వీపింగ్ మెషిన్‌ను ప్రారంభించారు. అనంతరం పట్టణంలో నిర్మించిన నూతన కమ్యూనిటీ మరుగుదొడ్ల ప్రారంభానికి హాజరయ్యారు.
వనపర్తిని అన్ని రంగాల్లో ముందుండేలా తీర్చిదిద్దుతామని నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రజలంతా పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ గట్టు యాదవ్, వైస్ ఛైర్మన్ శ్రీధర్, జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా పాల్గొన్నారు.
- ఇదీ చూడండి : 'నేను కాళికను.. నేనే శివుడిని'