వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని పిన్నంచర్ల, జూరాల గ్రామాలను పల్లె ప్రగతిలో భాగంగా రాష్ట్ర సీఐడీ విభాగం డీఐజీ గోవింద్ సింగ్ సందర్శించారు. పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డ్ , స్మశాన వాటికల నిర్మాణం, ఇంకుడు గుంతల నిర్మాణం పరిశీలించారు. అనంతరం పాఠశాలను సందర్శించి అధికారులకు తగు సూచనలు అందించారు. పాఠశాల వంట గదిలో వంట గ్యాస్ సిలిండర్లను వాడాలని, అసంపూర్తి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కృష్ణయ్య ,అడిషనల్ ఎస్పీ షాకీర్ హుస్సేన్, డీఎస్పీ కిరణ్ కుమార్ ,సిఐ సీతయ్య, అధికారులు పాల్గొన్నారు.
ఆత్మకూరు మండలంలో రాష్ట్ర సీఐడీ డీఐజీ పర్యటన - state cid dig participated in palle pragathi programm at vanaparthy district
రాష్ట్ర సీఐడీ విభాగం డీఐజీ గోవింద్ సింగ్ ఆత్మకూరు మండల పరిధిలోని గ్రామాలను సందర్శించారు.
![ఆత్మకూరు మండలంలో రాష్ట్ర సీఐడీ డీఐజీ పర్యటన ఆత్మకూరు మండంలో రాష్ట్ర సీఐడీ విభాగం డీఐజీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5871901-120-5871901-1580208583956.jpg?imwidth=3840)