వనపర్తి జిల్లా కొత్తకోట సమీపంలో... మంత్రి నిరంజన్ రెడ్డి కాన్వాయ్ వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. కొత్తకోటకు వెళ్తుండగా... గేదె అడ్డం వచ్చింది. పైలెట్ వాహనం డ్రైవర్ గేదెను తప్పించేందుకు బ్రేక్ వేశాడు. ఈ క్రమంలో కాన్వాయ్‌లోని వాహనాలు ఢీకొన్నాయి. ఓ వాహనం ముందు భాగం ధ్వంసమైంది. మంత్రి సహా ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు.
ఇదీ చూడండి: ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం