ETV Bharat / state

ఏడాది లక్ష్యం నాలుగు నెలల్లో పూర్తి - ఏడాది లక్ష్యం నాలుగు నెలల్లో పూర్తి వనపర్తి

జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద జిల్లాలకు ఇచ్చిన లక్ష్యాలను అధిగమించడంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి కూలీలకు కల్పించిన పని దినాలను ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి నాలుగు నెలల్లోనే అధిగమించడం గమనార్హం.

ఏడాది లక్ష్యం నాలుగు నెలల్లో పూర్తి
ఏడాది లక్ష్యం నాలుగు నెలల్లో పూర్తి
author img

By

Published : Jul 29, 2020, 11:57 AM IST

ప్రస్తుతం కరోనా కష్టకాలంలో ఉపాధి పనులకు ఉన్న డిమాండును తాజా పనిదినాలు స్పష్టం చేస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఐదు జిల్లాల్లో 2020 ఏప్రిల్‌ నుంచి జులై 27 వరకు ఉపాధి కూలీలకు కల్పించిన పని దినాల్లో నారాయణపేట జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ నిర్దేశిత లక్ష్యంలో 63శాతం పని దినాలు కల్పించారు. రెండో స్థానంలో వనపర్తి జిల్లా నిలిచింది. ఇక్కడ నిర్దేశించిన లక్ష్యంలో 51శాతం పని దినాలు కల్పించారు. ఆ తరవాత స్థానాల్లో నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, జోగులాంబ గద్వాల జిల్లాలు ఉన్నాయి.

కరోనా వైరస్‌తో మార్చిలో లాక్‌డౌన్‌ ప్రకటించింది మొదలు ఇప్పటి వరకు పలుచోట్ల, పలు ప్రైవేటు సంస్థల్లో పనిచేసే కార్మికులు ఈ కరోనా లాక్‌డౌన్‌ సమయంలో సొంత గ్రామాల్లోనే ఉంటూ ఉపాధి పనులకు వెళ్తున్నారు. మే 27 వరకు కరోనా లాక్‌డౌన్‌ ఉన్నా తరవాత ఎత్తేశారు. అయినా ప్రైవేటు సంస్థలు, విద్యాసంస్థలు ఇంకా తెరచుకోలేదు. దీంతో ఆయా సంస్థల్లో పనిచేసే కార్మికులు, తాత్కాలిక ఉద్యోగులు గత్యంతరం లేక ఉపాధిహామీ పనులతో జీవనం గడుపుతున్నారు. దీంతో జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులకు డిమాండు ఏర్పడింది. ఫలితంగా గ్రామాల్లో ఎక్కడ చూసినా ఉపాధి పనులు జోరందుకున్నాయి.

ప్రస్తుతం మొక్కలు నాటే కార్యక్రమం

ఏప్రిల్‌, మే నెలల్లో వ్యవసాయదారుల భూమి చదును, ఇతర పనులతోపాటు వాటర్‌షెడ్‌, చెరువుల్లో పూడికతీత పనులు జరిగాయి. తాజాగా వానాకాలంలో మొక్కల పెంపకం కోసం గుంతల తవ్వకం పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా గ్రామాల్లో ఏర్పాటు చేసే ఉద్యానవనాల పనులూ జరుగుతుండటం వల్ల ఉపాధి పనులు ఊపందుకున్నాయి.

కూలీల డిమాండుతోనే ఉపాధి కల్పన ..

"జిల్లాలో ఉపాధిహామీ పథకం కింద పనుల కోసం కూలీల డిమాండు అధికంగా ఉండడం వల్లే గత ఆర్థిక సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో అధికంగా పనిదినాలు కల్పించగలిగాం. ఇది శుభపరిణామమే. నెలాఖరులోగా మరో మూడు లక్షల పనిదినాలు కల్పించనున్నాం".

- కోదండరాములు, డీఆర్‌డీవో, వనపర్తి

ఇదీ చదవండి: ఏ చావైనా.. కొవిడ్​ చావుగా భావించడం సరికాదు: మంత్రి ఈటల

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.