ETV Bharat / state

దాడులు సహించేది లేదు: ఎస్సీ, ఎస్టీ కమిషన్ - తెలంగాణ వార్తలు

ఎస్సీ, ఎస్టీ సంక్షేమ ఫలాలు అర్హులకు అందేలా స్థానిక నాయకులు కృషి చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు చిలకమర్రి నరసింహ కోరారు. వారిపై దాడులు జరిగితే ఉపేక్షించేది లేదన్నారు. వనపర్తి జిల్లా ఆస్పత్రిలో పర్యటించిన ఆయన... వైద్య సేవలపై ఆరా తీశారు.

sc-st-commission-member-chilukamarri-narasimha-visits-wanaparthy-district-hospital
దాడులు సహించేది లేదు: ఎస్సీ, ఎస్టీ కమిషన్
author img

By

Published : Dec 21, 2020, 9:38 AM IST

ఎస్సీ, ఎస్టీలపై దాడులు చేస్తే సహించేది లేదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు చిలకమర్రి నరసింహ అన్నారు. బంగారు తెలంగాణ దిశగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. వనపర్తి జిల్లా దవాఖానాను ఆదివారం సందర్శించి... కేసీఆర్ కిట్ పంపిణీ, వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.

ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం చాలా ఖర్చు చేస్తోందని తెలిపారు. 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్​పై ఎందరికి అవగాహన కల్పించారని అధికారులను ప్రశ్నించారు. తమ ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, కుల ధ్రువీకరణ పత్రాలను సంబంధించిన విద్యుత్ కార్యాలయాల్లో సమర్పించి... ఉచిత విద్యుత్​ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని వినియోగించుకోవాలన్నారు.

ఎస్సీ, ఎస్టీలకు అన్ని సంక్షేమ ఫలాలు అందేలా స్థానిక నాయకులు కృషి చేయాలని కోరారు. అట్రాసిటీ చట్టాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయకుండా... నిజమైన భాదితులకు న్యాయం జరిగేలా వినియోగించాలని కోరారు.

ఇదీ చదవండి: పన్ను ఎగవేతకు అడ్డుకట్ట ఎలా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.