ETV Bharat / state

'ఆ ఘనత.. ప్రధానికే దక్కుతుంది' - ప్రధాని నరేంద్రమోదీ

వనపర్తి జిల్లాలో.. సఫాయి కర్మచారి కమిషన్ ఛైర్మన్ ఎన్. శ్రీనివాసన్ పర్యటించారు. పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Safai karma chari Commission
సఫాయి కర్మచారి కమిషన్
author img

By

Published : Apr 20, 2021, 4:39 PM IST

దేశ చరిత్రలో పారిశుద్ధ్య కార్మికులకు కమిషన్ ఏర్పాటు చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని సఫాయి కర్మచారి కమిషన్ ఛైర్మన్ ఎన్.శ్రీనివాసన్ పేర్కొన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులతో ఆయన సమావేశమయ్యారు.

పారిశుద్ధ్య కర్మచారులందరూ తమ సమస్యలను కమిషన్​ దృష్టికి తీసుకురావాలని శ్రీనివాసన్ సూచించారు. తద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వివరించారు. అనంతరం.. పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో.. జాతీయ కర్మచారి కమిషన్ సభ్యులు ఎం.వెంకటేశన్, జేసీ వేణుగోపాల్, డీపీఓ నర్సింహులు, మున్సిపల్ ఛైర్మన్ గట్టు యాదవ్, కమిషనర్ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.