వనపర్తి జిల్లా వనపర్తి మండలం పెద్దగూడెం, సవాయిగూడెం , కిష్టగిరి గ్రామాలను కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సందర్శించారు. నిర్మాణంలో ఉన్న పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలను ఆమె తనిఖీ చేశారు. తొలుత పెద్దగూడెం గ్రామంలో రైతు వేదికను తనిఖీ చేసి పల్లె ప్రకృతి వనంతో పాటు రైతు వేదిక నిర్మాణం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రైతు వేదిక నిర్మాణ పనులను సైతం వేగవంతం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.
'అవసరమైన రంగులు అద్దాలి'
క్రిష్ణగిరిలో పల్లె ప్రకృతి వనం నిర్మాణం పట్ల సిబ్బందిని మెచ్చుకున్నారు. పల్లె ప్రకృతి వనానికి ఇంకా అవసరమైన రంగులు వేయాలని అందంగా ఉండేలా రంగురంగుల మొక్కలను నాటించాలని సూచించారు. ఎప్పటికప్పుడు మొక్కలు నాటడం సహా శుభ్రంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రాజేశ్వరి , పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శివకుమార్ , ఎంపీడీఓ రవీంద్ర బాబు, ఎంపీపీ కిచ్చారెడ్డి, సర్పంచ్ కొండయ్య, తదితరులు ఉన్నారు.