చెరువులు, కుంటల నాలాలు, ఎఫ్టీఎల్ల ఆక్రమణలకు తొలగించేందుకు ఇరిగేషన్, మున్సిపల్ ,రెవెన్యూ అధికారులతో సర్వే బృందాలను ఏర్పాటు చేస్తునట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తెలిపారు. శనివారం ఆమె తన చాంబర్లో వర్షాల కారణంగా నిండిన చెరువులు, కుంటలు, వాటి నీటి సామర్థ్యం తదితర అంశాలపై సమీక్షించారు. చెరువులు, కుంటల ఆక్రమణలపై చర్చించారు.
సర్వే చేసి తొలగించాలి..
ఈ నెల 21 నుంచి మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ సంయుక్త బృందాలు జిల్లా, మున్సిపల్ పట్టణ ప్రాంతాలతో పాటు మండలాల్లోనూ చెరువులు, కుంటల నాళాలు, ఎఫ్టీఎల్లు ఆక్రమణలకు గురైతే సర్వే చేసి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.
తాళ్లచెరువు ఆక్రమణలు తొలగిచండి..
సోమవారం నుంచి వనపర్తి పట్టణంలోని తాళ్లచెరువు నాలా ఆక్రమణలను గుర్తించి తొలగించమని ఆదేశింంచారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, ఇరిగేషన్ ఈఈ ఆంజనేయులు, వనపర్తి తహసీల్దార్ రాజేందర్ గౌడ్ డిప్యుటీ ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.