ETV Bharat / state

ఎల్​ఆర్​ఎస్​ను రద్దు చేయాలి: రియల్ ఎస్టేట్ అసోసియేషన్

ఎల్​ఆర్​ఎస్​ను రద్దు చేయాలని వనపర్తి జిల్లా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ప్రజలకు భారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది. ధరణిలో తప్పులు సరిచేసి రిజిస్ట్రేషన్ విధానాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని కోరింది.

real estate association strke on lrs
ఎల్​ఆర్​ఎస్​ రద్దు చేయాలని రియల్ ఎస్టేట్ అసోసియేషన్ డిమాండ్
author img

By

Published : Dec 17, 2020, 11:04 PM IST

ఎల్​ఆర్​ఎస్​ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా రియల్ ఎస్టేట్ అసోసియేషన్, దస్తావేజుల లేఖర్లు.. వనపర్తి ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అర్హత గల దస్తావేజుల లేఖర్లకు లైసెన్సులు మంజూరు చేయాలి. కరోనాతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు..ఎల్​ఆర్​ఎస్ మరింత భారంగా మారింది. దీనిని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి.

- వనపర్తి జిల్లా రియల్ ఎస్టేట్ అసోసియేషన్

నూతనంగా రూపొందించిన ధరణి పోర్టల్​లో పూర్తిగా తప్పులు ఉన్నాయన్నారు. వాటిని సరిచేసి రిజిస్ట్రేషన్ విధానాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో వినతిపత్రాన్ని ఆర్డీవోకు అందజేశారు.

ఇదీ చూడండి: ప్రజల సమాచారం ప్రభుత్వం సేకరిస్తే అంగీకరించం: హైకోర్టు​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.