ETV Bharat / state

ఉపాధ్యాయుడు కాదు.. చిన్నారులను చెరుస్తున్న కామాంధుడు - కీచకునికి దేహశుద్ధి...

పేరుకు ఉపాధ్యాయుడు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఆ వ్యక్తి.. వికృత చేష్టలకు పాల్పడ్డాడు. గణతంత్ర దినోత్సవం రోజునే మద్యం సేవించి మత్తులో నాలుగో తరగతి చిన్నారిని చెరిచాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

PRIVATE SCHOOL TEACHER RAPE A 4 YEARS OLD GIRL IN EDHUTLA

author img

By

Published : Mar 6, 2020, 10:48 AM IST

వనపర్తి జిల్లా గోపాల్​పేట మండలం ఏదుట్లలో మరో కీచక ఉపాధ్యాయుని బాగోతం బయటపడింది. గురుకులంలో ప్రవేశాల కోసం శిక్షణ పేరుతో ఇంటికి పిలిచి బాలికలపై లైగింక దాడులకు పాల్పడిన కామాంధునికి.. గ్రామస్థులు దేహశుద్ధి చేశారు.

ఎలా తెలిసిందంటే...

గ్రామంలో ఓ బాలిక స్నానానికి వెళ్తూ తల్లిని రావద్దని చెప్పింది. అనుమానం వచ్చిన తల్లి గదిలోకి వెళ్లి చూస్తే బాలికకు తీవ్రంగా రక్తస్రావం అవుతోంది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా బాలికపై లైంగిక దాడి జరిగినట్లు వైద్యులు వెల్లడించారు. కారణమెవరని బాలికను ఆరా తీయగా... జరిగిన విషయం చెప్పింది.

జనవరి 26న మద్యం మత్తులో...

ఏదుట్లలో ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న సామ శరత్ కుమార్ బాలికపై అఘాయిత్యం చేశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు... అప్పటికే కొల్లాపూర్​కు వెళ్లిన దుండగున్ని గ్రామానికి తీసుకొచ్చారు. పంచాయతీ వద్ద నిలదీయగా... జనవరి 26న మద్యం మత్తులో ఒక నాలుగో తరగతి అమ్మాయిపైన దారుణానికి పాల్పడినట్లు ఆంగీకరించాడు. గ్రామస్థులు గుచ్చిగుచ్చి అడగ్గా... మిగతా దారుణాలు బయటపడ్డాయి.

కీచకునికి దేహశుద్ధి...

తీవ్ర ఆగ్రహానికి గురైన గ్రామస్థులు కీచక టీచర్​కు దేహశుద్ధి చేశారు. విషయంలో తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన గ్రామానికి వెళ్లి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. గోపాల్​పేట పోలీస్​స్టేషన్​కు తరలించారు. బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ బాలికనే కాకుండా... సూమారు పది పదిహేను మందిని నిందితుడు లైంగికంగా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. విషయం బయటకు చెప్తే... గురుకులంలో సీటు రాకుండా చేస్తానని బాలికలను బెదిరించేవాడని సమాచారం.

ఉపాధ్యాయుని ముసుగులో చిన్నారులను చేరుస్తున్న కామాంధుడు

ఇవీ చూడండి: ఏ పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.