నేటి సమాజంలో మహిళలు తమను తాము రక్షించుకునేందుకు ఆత్మరక్షణ నైపుణ్యాలు అభ్యసించాలని డీఎస్పీ మల్లికార్జునకిరణ్ సూచించారు. వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు వారం రోజుల ఉచిత కరాటే శిక్షణ అందిస్తున్నారు. ఈ శిక్షణ శిభిరాన్ని విద్యార్థులు వినియోగించుకుని శ్రద్ధగా నేర్చుకోవాలన్నారు. మహిళల రక్షణార్థం రాష్ట్ర పోలీసు యంత్రాంగం అనేక రకాల చర్యలు చేపట్టిందన్నారు. ఎలాంటి ప్రమాదం జరిగిన తక్షణమే... డయల్ 100కు సమాచారం అందిస్తే... 10 నుంచి 15 నిమిషాలలో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుంటారని డీఎస్పీ తెలిపారు.
ఇదీ చూడండి : సంక్షేమ బోర్డు.. సరకుల రవాణా.. బస్సుల తగ్గింపు!