ETV Bharat / state

ప్లాస్టిక్​పై వనపర్తి జిల్లా యంత్రాంగం యుద్ధం

ప్లాస్టిక్​ నిషేధించడమే లక్ష్యంగా వనపర్తి జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. ప్లాస్టిక్​ వాడకం వల్ల భవిష్యత్​లో వచ్చే అనర్థాలను వివరిస్తూ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. విద్యార్థుల చేత కాగితం సంచులు తయారు చేయిస్తున్నారు.

దుకాణా దారులకు కాగితం సంచులు అందిస్తున్న అధికారులు
author img

By

Published : Aug 16, 2019, 4:46 PM IST

ప్లాస్టిక్​పై వనపర్తి జిల్లా యంత్రాంగం యుద్ధం

వనపర్తి జిల్లా అధికార యంత్రాంగం ప్లాస్టిక్​పై యుద్ధం ప్రకటించింది. ప్లాస్టిక్​ వాడొద్దంటూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఉన్నతాధికారులు ప్రతీ మండలంలోని రెండు గ్రామాలను దత్తత తీసుకుని ఆయా గ్రామాలలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పిస్తూ గ్రామంలోని పరిసరాలలో ప్లాస్టిక్ లేకుండా ఏరివేత కార్యక్రమం చేపట్టారు.

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని పట్టణ, గ్రామాల్లోని హోటళ్లు, కిరాణా దుకాణాలు, మాంసం విక్రయ కేంద్రాల్లో ప్లాస్టిక్​ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తున్నారు. కాగితపు సంచులు, వస్త్రపు సంచులను వాడుకోవాలని సూచిస్తున్నారు. కాగితపు సంచులు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునేలా పలు శిక్షణ కార్యక్రమాలను ఉచితంగా ఇస్తున్నారు. 190 పాఠశాలల్లో ప్రతీ స్కూల్​ నుంచి 1000 కాగితపు సంచులు తయారీ చేయించి.. వ్యాపారస్తులకు ఉచితంగా పంపిణీ చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది.

కాగితపు సంచులు

పాఠశాలలోని ఒక్కో విద్యార్థి గంట సమయంలో ఏడు కాగితపు సంచులు తయారు చేస్తారని జిల్లా విద్యాధికారి సుశీంద్ర రావు తెలిపారు. రానున్న రోజుల్లో ప్లాస్టిక్ వాడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని జరిమానాలు విధించనున్నట్లు చెప్పారు.కాగితపు సంచులు తయారు చేస్తున్న విద్యార్థులు తమ ఇంట్లో ప్లాస్టిక్ కవర్లను వాడకుండా చూస్తున్నామన్నారు. కాగితపు సంచులు తయారు చేసి తల్లిదండ్రులకు అందిస్తున్నామమని చెప్పారు. మహిళా సంఘాలకు కాగితపు సంచులు, వస్త్రపు సంచులు తయారీపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారితో సంచులను తయారు చేయిస్తున్నామని జిల్లా కలెక్టర్ వెల్లడించారు.

ఇవీ చూడండి: గవర్నర్​ తేనీటి విందుకు హాజరైన పలువురు ప్రముఖులు

Intro:tg_mbnr_09_14_plastic_ban_awareness_pkg_ts10053
వనపర్తి జిల్లాలోని ప్రతి గ్రామంలో ప్లాస్టిక్ నిషేధించడానికి జిల్లా అధికార యంత్రాంగం నడుంబిగించింది
ప్లాస్టిక్ వాడకం వలన భవిష్యత్తులో కలిగే అనర్థాలను వివరిస్తూ పలు అవగాహన కార్యక్రమాలను పట్టణ మునిసిపాలిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ప్రత్యేక పర్యవేక్షణలో చేపట్టింది .
ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఉన్నతాధికారులను ప్రతి మండలంలోని రెండు గ్రామాలను దత్తత తీసుకొని ఆయా గ్రామాలలో ప్లాస్టిక్ నిషేధం పై అవగాహన కల్పిస్తూ గ్రామంలోని పరిసరాలలో ప్లాస్టిక్ను లేకుండా ఏరివేత కార్యక్రమం చేపట్టారు.
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని పట్టణంలోని గ్రామాల్లోని హోటల్లు కిరాణా దుకాణాలు మాంసం విక్రయ కేంద్రాలు తదితర వ్యాపార సంస్థల నిర్వాహకులకు అవగాహన కార్యక్రమం చేపట్టి ప్రతి ఒక్కరికి ప్లాస్టిక్ ను నిషేధించాలని కోరుతూ అవగాహన కల్పించారు
ప్లాస్టిక్ కవర్లను నిషేధించి వాటి స్థానంలో కాగితపు సంచులు వస్త్రపు సంచులను వాడుకోవాలని కాగితపు సంచులు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునేలా పలు శిక్షణ కార్యక్రమాలను ఉచితంగా ఇస్తున్నారు
ఈ సందర్భంగా గా 190 పాఠశాలల్లో ప్రతి పాఠశాల నుంచి 1000 కాగితపు సంచులు తయారీ చేపట్టి మొదటగా వ్యాపారస్తులకు ఉచితంగా పంపిణీ చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చొరవ తీసుకొని సంచుల తయారీని చేపట్టింది
పాఠశాలలోని ఒక్కో విద్యార్థి ఇ గంట సమయంలో కాగితపు సంచులు తయారు చేస్తారని ఆ విధంగా జిల్లాలోని అన్ని పాఠశాలలో కేవలం గంట సమయంలో కాగితపు సంచులు తయారు అవుతున్నాయని జిల్లా విద్యాధికారి సుశీంద్ర రావు తెలిపారు.
మొదటగా కాగితపు వస్త్రాలతో తయారుచేసిన సంచులను ప్రతి దుకాణం లో వాడుకలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు రానున్న రోజుల్లో ప్లాస్టిక్ వాడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని జరిమానాలు విధించడం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు
పర్యావరణం కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి చేపట్టారని మరో నెల రోజుల్లో వనపర్తి జిల్లా పరిధిలోని అన్ని గ్రామాలలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన వస్తుందని ఆయన అన్నారు
కాగితపు సంచులు తయారు చేస్తున్న విద్యార్థులు ప్రతి విద్యార్థి వారింట్లో ప్లాస్టిక్ కవర్లను వాడకుండా చూస్తున్నామని అవసరమైతే ఇంట్లోనే కాగితపు సంచులు తయారు చేసి తల్లిదండ్రులకు అందిస్తున్నామని ఉపాధ్యాయులు చెప్పిన పద్ధతి క్రమం తప్పకుండా పాటిస్తానని తన తల్లిదండ్రులు కూడా ఇస్తామని విద్యార్థులు పేర్కొంటున్నారు
ఈ సందర్భంగా మహిళా సంఘాల మహిళలకు కాగితపు సంచులు తయారీ వస్త్రపు సంచులు తయారీ ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారితో సంచులను తయారు చేస్తున్నామని ప్రతి ఒక్కరు కచ్చితంగా ప్లాస్టిక్ కవర్లను నిషేధించి కాగితపు సంచులు జిల్లా కలెక్టర్ సూచించింది

Body:tg_mbnr_09_14_plastic_ban_awareness_pkg_ts10053

Conclusion:tg_mbnr_09_14_plastic_ban_awareness_pkg_ts10053

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.