వనపర్తి జిల్లా పెద్దగూడెం, కడుకుంట్ల గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యం తడిసిపోయింది. కడుకుంట్లలో రైతుల నుంచి కొనుగోలు చేసిన దాదాపు 2 వేల బస్తాలు స్వల్పంగా వర్షానికి తడిశాయి. పెద్దగూడెంలో అన్నదాతలు కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ధాన్యంపై కవర్లు కప్పి ఉంచడంతో కొంతవరకు ధాన్యం తడిసింది.
వర్షానికి తడిసిన ధాన్యాన్ని అధికారులు మద్దతు ధరకే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంపై కప్పడానికి కవర్లు లేకపోవడంతో చూస్తూ ఉండిపోవాల్సి వచ్చిందని నిర్వాహకులు వాపోయారు.
ఇదీ చదవండి: కరోనా వేళ... ప్రైవేట్ ఆసుపత్రుల కాసుల వేట..!