ETV Bharat / state

అమావాస్య వచ్చిందంటే చాలు.. రక్తం తాగే మనిషి! - వనపర్తి జిల్లా

అమావాస్య వచ్చిందంటే చాలు అతడికి ఆరోజు రక్తమే ఆహారం. ప్రతి అమావాస్య రోజు మేకలు, గొర్రెల గొంతులు కోసి రక్తం తాగుతాడు. ఇప్పటికి 50 మూగజీవాల ప్రాణం తీశాడు. గ్రామస్థులకు అతడి తీరుపై అనుమానం వచ్చి నిలదీశారు. అసలు బండారం బయటపెట్టాడు. ఈ ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది.

అమావాస్య వచ్చిందంటే చాలు.. రక్తం తాగే మనిషి!
author img

By

Published : Oct 15, 2019, 5:55 PM IST

వనపర్తి జిల్లా అమరచింత మండలం సింగంపేట గ్రామానికి చెందిన కమ్మరి రాజు అనే వ్యక్తి మూగజీవాల రక్తం తాగుతూ జనాలను భయాందోళనలకు గురి చేస్తున్నాడు. అమావాస్య వచ్చిందంటే చాలు గొర్రెలు, మేకల గొంతుకోసి వాటి రక్తం తాగుతున్నాడు. అలా ఇప్పటికి 50 మూగజీవాల ప్రాణం తీశాడు. రాజు తీరుపై అనుమానం వచ్చిన గ్రామస్థులు అతడిని నిలదీయగా నాలుగైదు సంవత్సరాలుగా ఇలా మూగజీవాల రక్తం తాగుతున్నట్లుగా వివరించాడు.

కుటుంబ సభ్యుల అసహనం

రాజు ఆగడాలపై కుటుంబీకులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎంత చెప్పినా అతడి ప్రవర్తనలో మార్పు కనిపించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజు చేష్టలతో ఎన్నో సార్లు చనిపోయిన మేకలు, గొర్రెలకు పరిహారం చెల్లించామని వాపోతున్నారు. రాజు మానసిక స్థితి బాగాలేదని... అతడికి మెరుగైన చికిత్స అందించేందుకు ప్రభుత్వం సాయం అందించాలని కుటుంబీకులు కోరుతున్నారు.

భయపడుతున్న గ్రామస్థులు

రాజు వింత ప్రవర్తనతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. రక్తానికి అలవాటు పడిన అతడు చిన్నపిల్లలు, వృద్ధులపై దాడి చేస్తే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. అధికారులు చొరవ తీసుకొని రాజు ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని వేడుకుంటున్నారు.

అమావాస్య వచ్చిందంటే చాలు.. రక్తం తాగే మనిషి!

ఇదీ చూడండి: ఆత్మహత్యకు యత్నించిన ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి మృతి

Intro:Tg_mbnr_12_04_Raktham_tage_manishi_avb_TS10092
మూగజీవాల రక్తం తాగే రాజు.
భయాందోళనలో గ్రామస్తులు.

Body:వనపర్తి జిల్లా అమరచింత మండలం సింగం పేట గ్రామానికి చెందిన కమ్మరి రాజు రక్తం తాగుతూ జనాన్ని భయాందోళనలకు గురి చేస్తున్నాడు. ఇంతకీ... ఎవరి రక్తం తాగుతున్నాడు అని ఆలోచిస్తున్నారా. ప్రతి అమావాస్య రోజున మేకలు, గొర్రెలు గొంతు కోసి వాటి రక్తం తాగుతున్నాడుఅని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు 50కి పైగా గొర్రెల గొంతుకోసి వాటి రక్తం తాగాడని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రాజు పై అనుమానం వచ్చి నిలదీయగా నాలుగైదు సంవత్సరాలుగా గ్రామంలో ప్రతి అమావాస్యకు మూగజీవాలను చంపుతానని రాజే అంగీకరించినట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు.
దీనిపై రాజుని వివరణ కోరగా తానే చేసినట్లుగా చెబుతున్నాడు.
కుటుంబ సభ్యులు సైతం రాజు ఆగడాలపై అసహనం వ్యక్తం చేశారు. ఎన్నోసార్లు, చంపిన గొర్రెలకు మేకలకు పరిహారం చెల్లించాలని వాపోయారు. పలుమార్లు మందలించిన రాజు తీరు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.రాజు మానసిక స్థితి బాగుచేయడానికి ప్రభుత్వం సహకరించాలని వేడుకుంటున్నారు.

Conclusion:గ్రామస్తులు మాత్రం గొర్రెలు,మేకల పై దాడి చేస్తున్న రాజు చిన్నపిల్లలు, వృద్ధులపై దాడి చేస్తే పరిస్థితి ఏంటి అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు లేదా పోలీసులు చొరవ తీసుకుని రాజు ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

9959999069,మక్థల్.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.