వనపర్తి జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న రాజానగరం అమ్మ చెరువు, నల్లచెరువులో గత మూడు రోజులుగా అధిక సంఖ్యలో చేపలు చనిపోయి చెరువు ఒడ్డుకు చేరుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు గత ఏడాది ఆగస్టులో లక్ష 5 వేల చేపపిల్లలను పంపిణీ చేసింది.
కాలుష్య కోరలలో చిక్కుకొని అమ్ముకునే సమయానికి సుమారు 3 టన్నుల చేపలు చనిపోవడం మత్స్యకారులకు తీవ్ర నష్టం మిగిల్చింది. చెరువుల్లోకి కాలుష్య నీరు చేరడం, పందుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని మత్స్యకారులు వాపోతున్నారు. ప్రభుత్వపరంగా తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.