ETV Bharat / state

తెరాస ఎంపీల "కీ" కేసీఆర్ చేతిలో: శ్రుతి - భాజపా అభ్యర్థి

కేసీఆర్​ 'కీ' ఇస్తేనే తెరాస ఎంపీలు పని చేస్తారని నాగర్​కర్నూల్​ భాజపా ఎంపీ అభ్యర్థి బంగారు శ్రుతి విమర్శించారు. తనను గెలిపిస్తే వనపర్తి జిల్లాలో పెద్దమందడి మండలాన్ని రాష్ట్రంలోనే నంబర్​ వన్​గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

ఎన్నికల ప్రచారంలో భాజపా అభ్యర్థి బంగారు శ్రుతి
author img

By

Published : Apr 4, 2019, 5:44 PM IST

ఎన్నికల ప్రచారంలో భాజపా అభ్యర్థి బంగారు శ్రుతి
తనను గెలిపిస్తే గద్వాల నుంచి మాచర్ల, కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు రైల్వే లైన్​ ఏర్పాటు చేయిస్తానని నాగర్​కర్నూల్​ భాజపా అభ్యర్థి బంగారు శ్రుతి హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలో రైల్వే జంక్షన్​ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో ప్రచారం నిర్వహించిన శ్రుతి.. తెరాస ఎంపీలనుగెలిపించినా సొంత నిర్ణయాలు తీసుకోలేరని విమర్శించారు.

ఇవీ చూడండి:'తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తిని కాదు'

Intro:tg_mbnr_03_04_bjp_shruthi_road_show_avb_c3
తెరాస కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు మర బొమ్మలని వారికి అధినేతలు కి ఇస్తేనే పనులు చేస్తారని నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి శృతి బంగారు విమర్శించారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం లో రోడ్ షో చేపట్టారు మండల కేంద్రంలోని వీధుల గుండా తిరుగుతూ కమలం పువ్వు ఓటేయాలని ఆమె అభ్యర్థించారు అనంతరం సమావేశంలో మాట్లాడుతూ తనను పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపిస్తే గద్వాల నుంచి మాచర్ల రైల్వే లైన్ కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు రైల్వే లైను ఏర్పాటు చేసి వనపర్తి నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రైల్వే జంక్షన్ ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు జాతీయ రహదారులు రైల్వే మార్గాలు ఉంటే జిల్లాలు త్వరితగతిన అభివృద్ధి సాధిస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు ట్రాన్స్ పోర్ట్ కు అనుకూలంగా ఉన్న చోట పరిశ్రమల స్థాపనకు వ్యాపారస్తులు ముందుకు వస్తారని ఆమె పేర్కొన్నారు నేడు కాంగ్రెస్ టిఆర్ఎస్ అభ్యర్థులు వారి అధినేత చేతుల్లో కీలుబొమ్మలుగా వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించారు తెరాస అభ్యర్థి పి రాములు కెసిఆర్ ముందు కూర్చోవడానికి భయపడతాడని అలాంటి వారు అభివృద్ధిలో లో ఏ విధమైన సొంత నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం లేదన్నారు కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి రాహుల్ గాంధీ ఆడిస్తే ఆడే ఆట బొమ్మగా ఉంటాడని ఆమె విమర్శించారు భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి తనను గెలిపిస్తే నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి పధం లో నడిపిస్తాడని ఆమె పేర్కొన్నారు గతంలో ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా పని చేసిన వ్యక్తులు పెద్దమందడి మండల వైపు తిరిగి చూడలేదని తాను అలాంటి వ్యక్తిని కానని తనకు నా అనే వారు ఎవరూ లేరని సొంత లాభం చూసుకోకుండా ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా భావించి పని చేస్తానని ఆమె పేర్కొన్నారు కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి కొత్త మహేందర్ రెడ్డి ఇ బి సి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందకుమార్ ర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Body:tg_mbnr_03_04_bjp_shruthi_road_show_avb_c3

Conclusion:tg_mbnr_03_04_bjp_shruthi_road_show_avb_c3
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.