వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలోని 30 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ కొనసాగుతోంది. మున్సిపాలిటీ లోని 16431 మంది ఓటర్లు... రాజ్యాంగం తమకు కల్పించిన ఓటు హక్కును ఈ రోజు వినియోగించుకోనున్నారు. బరిలో ఉన్న 63 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నేడు తేల్చనున్నారు. ఓటర్లు ఏడు గంటలకే క్యూలైన్లో నిలబడి ఓటు వేయడానికి ఆసక్తి చూపారు. ప్రజలు అన్ని పోలింగ్ స్టేషన్లలో ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొంటున్నారు.
ఇవీ చూడండి: ముఖ్యమంత్రికి అస్వస్థత.. యశోదాలో వైద్య పరీక్షలు