ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధపడుతుండటం వల్ల వైద్యులు ఇంటి వద్దే పరీక్షించారు. జ్వరం స్వల్పంగా ఎక్కువగా ఉండటం వల్ల గత రాత్రి 9 గంటల ప్రాంతంలో సోమాజిగూడలోని యశోదా ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులు పలు పరీక్షలు చేసి విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. పరీక్షల అనంతరం సీఎం రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో తిరిగి ప్రగతిభవన్‌కు వెళ్లారు. ఆసుపత్రిలో కేసీఆర్ వెంట ఆయన సతీమణి, కూతురు కవిత, కుటుంబసభ్యులు ఉన్నారు.
ఇవీ చూడండి: తెలంగాణలో అద్భుత వ్యాపార అవకాశాలున్నాయి: కేటీఆర్