వనపర్తి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సందర్శించారు. వచ్చే విజయదశమి నాటికి కార్యాలయం పనులు పూర్తి చేయాలని గుత్తేదారును మంత్రి ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో చేపట్టవలసిన నిర్మాణాలకు సంబంధించి అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు.
నిర్మాణాల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని... ప్రతి కట్టడం పటిష్ఠంగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు. ప్రహరీ గోడ నిర్మాణానికి సంబంధించిన నమూనాను అధికారులకు సూచించారు. సంబంధిత అధికారులు పనులు వేగవంతంగా అయ్యేలా చూడాలని మంత్రి తెలిపారు.