రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడానికి పంచాయతీ సిబ్బంది వేతనాలు పెంచామని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గ్రామాలలో ప్రకృతి వనం, వైకుంఠదామంతో పాటు నర్సరీలు ఏర్పాటు చేసి హరితహారం కోసం మొక్కల పెంపకం చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీఎం కేసీఆర్… అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లిలో నిర్మించిన 20.. రెండు పడకల గదుల ఇళ్ల పట్టాలను మంత్రి లబ్ధిదారులకు అందించారు.
రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు లేకుండా చేసుకున్నామని... రైతుబంధు పేరుతో రాష్ట్రంలో 63 లక్షల 25 వేల మందికి లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రతిఒక్కరు బాధ్యతగా మొక్కలు పెంచాలని సూచించారు.
ఇదీ చూడండి: CM KCR:వరంగల్ గ్రామీణ, అర్బన్ జిల్లాలకు కొత్త పేర్లు: కేసీఆర్