వర్షాలతో నష్టపోయిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో ఆదుకుంటామని మంత్రి నిరంజన్ రెడ్డి హామీ ఇచ్చారు. పలుచోట్ల చేతికందే తరుణంలో ఉన్న వరి, మామిడి పంటలు పాడై పోయాయని... ఈ విషయంలో రైతులు ఏ మాత్రం అధైర్య పడొద్దని సూచించారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో ఆయన పర్యటించి వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.
పంట నష్ట తీవ్రతను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని... అవసరమైతే పంటల బీమా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంట నష్టం ఎక్కువ మొత్తంలో ఉంది కాబట్టి జాతీయ విపత్తు కింద పరిగణించి ఉన్నతాధికారులతో మాట్లాడి రైతులు నష్టపోకుండా చూస్తామని రైతులకు హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: కరోనా పంజా: 12 గంటల్లో 25 మంది మృతి