ETV Bharat / state

Lemongrass Products: నిమ్మగడ్డి ఉత్పత్తులతో ఆదాయం... వనపర్తి జిల్లా మహిళల ఆదర్శం - Lemongrass farmers

Lemongrass Products: మొక్కల నుంచి తీసే సుగంధ, ఔషధ తైలాలకు అంతర్జాతీయంగా భారీ డిమాండ్ ఉంది. ప్రధానంగా నిమ్మగడ్డి నుంచి ఉత్పత్తి చేసే నూనె, ఔషధ, సుగంధ ఉత్పత్తులకు ఆదరణ ఎక్కువ. అందుకే వనపర్తి జిల్లా చీకురుచెట్టుతండా మహిళలు... ఝాన్సీ లక్ష్మీబాయి మహిళా సంఘంగా ఏర్పాటై... నిమ్మగడ్డితో పలు ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. నూనె, సబ్బులు, అత్తరు, టీపొడి తయారు చేసి తద్వారా ఉపాధి పొందుతున్నారు. మరోవైపు నిమ్మగడ్డి సాగుతో రైతులకు ఆదాయాన్ని అందిస్తున్నారు.

Lemongrass
Lemongrass
author img

By

Published : Apr 11, 2022, 12:05 PM IST

నిమ్మగడ్డి ఉత్పత్తులతో ఆదాయం... వనపర్తి జిల్లా మహిళల ఆదర్శం

Lemongrass Products: రాష్ట్రంలో కనిపించే సుగంధద్రవ్య, ఔషధ మొక్కల పంటల్లో ప్రముఖమైనది నిమ్మగడ్డి. నిమ్మగడ్డి నుంచి ఉత్పత్తి చేసిన తైలాన్ని ఔషధాల్లో వాడతారు. సబ్బులు, షాంపూల్లాంటి ఉత్పత్తుల తయారీకీ వినియోగిస్తారు. నిమ్మగడ్డి తేనీరు ఆరోగ్యానికి మేలు. సేంద్రీయ విధానంలో పండించిన నిమ్మగడ్డికి, సహజ ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకుని నిమ్మగడ్డి సాగు ద్వారా రైతులకు, ఉత్పత్తుల తయారీ ద్వారా మహిళలకు మెరుగైన ఉపాధి కల్పించేందుకు ప్రయత్నిస్తోంది వనపర్తి జిల్లా యంత్రాంగం. కలెక్టర్ యాస్మిన్ బాషా చొరవతో పెద్దమందడి మండలం చీకురుచెట్టు తండాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిమ్మగడ్డి నూనె తయారీ కేంద్రం సత్ఫలితాలిస్తోంది.

జేఎల్​జీ పేరిట: వివిధ సంఘాల నుంచి ఎంపికైన 10మంది ఔత్సాహిక మహిళలు, ఝాన్సీలక్ష్మీబాయి జేఎల్​జీ పేరిట నిమ్మగడ్డి నూనె తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం చుట్టుపక్కల 13 మంది రైతులతో 12 ఎకరాల్లో నిమ్మగడ్డిని సాగుచేయించారు. తొలిసారి కోతను టన్నుకు 5వేల చొప్పున సుమారు 40 టన్నుల గడ్డిని రైతుల నుంచి మహిళలే కొనుగోలు చేశారు. సేకరించిన నిమ్మగడ్డి నుంచి డిస్టిలేషన్ యూనిట్‌కు తరలించి అక్కడ నూనె తయారు చేస్తున్నారు. టన్ను నిమ్మగడ్డితో 10 లీటర్ల నూనె తయారవుతుందని, ఇప్పటి వరకూ నిమ్మగడ్డి నూనె విక్రయాల ద్వారా లక్షా 20వేల వరకూ ఆదాయాన్ని పొందినట్లు సంఘం అధ్యక్షురాలు మోతీబాయి వెల్లడించారు.

ఇతర పంటలతో పోల్చితే నిమ్మగడ్డి ద్వారా మంచి ఆదాయం లభిస్తోందని రైతులు చెబుతుంటే... నిమ్మగడ్డి నూనె తయారీ కేంద్రంతో ఉపాధి దొరుకుతోందని పలువురు మహిళలు తెలిపారు. మరోవైపు సాగు నుంచి ఉత్పత్తుల తయారీ వరకూ రసాయనాల్లేని సేంద్రీయ విధానాలు అనుసరిస్తున్నామని పేర్కొన్నారు.

టైకార్ పథకం ద్వారా: ఈ ప్రాజెక్టు విలువ 18 లక్షల 55వేలు కాగా... కలెక్టర్ చొరవతో టైకార్ పథకం కింద 11లక్షల 13వేల రాయితీని ప్రభుత్వం అందించింది. సమన్వయం, అమలు సహా మార్కెటింగ్‌కు సెరాట్రస్టు సేవలందిస్తోంది. ఎన్​ఐఆర్​డీపీఆర్ (N.I.R.D.P.R) రైతులకు అవగాహన కల్పిస్తుండగా... సీఐఎంఏఆర్ (C.I.M.A.P) మొక్కల పంపిణీ, తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం నిమ్మగడ్డి సాగు, కోత అనంతర ఉత్పత్తులపై సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నాయి. మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు నాబార్డు ముందుకొచ్చింది. ప్రస్తుతం ఇతర రాష్టాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయని మండల మహిళా సమాఖ్య ఏపీఎం తెలిపారు.

నిమ్మగడ్డి నూనె తయారీ కేంద్రం ద్వారా మరింత ఆదాయం పొందాలంటే... నిమ్మగడ్డి సాగు పెరగాల్సి ఉంది. అందుకు రైతులకు సాగు మెళకువలు, రాయితీపై విత్తనాలు, బిందు, తుంపర సేద్య పరికరాలు అందించాల్సిన అవసరముంది. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తే... మహిళల ఉత్పత్తులు ప్రపంచస్థాయిలో అమ్మే అవకాశాలున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.