శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో రామమందిరం నిర్మించాలని కోరుతూ కర్ణాటక వాసులు చేస్తున్న పాదయాత్ర వనపర్తి జిల్లా కొత్తకోటకు చేరింది. వీరికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. మంజునాథ్ ఆధ్వర్యంలో ఆరుగురు వ్యక్తులు కర్ణాటక రాష్ట్రంలోని హూడి నుంచి ఉత్తరప్రదేశ్లోని అయోధ్య వరకు పాదయాత్రకు పూనుకున్నారు. ఆగస్టు 16న ప్రారంభమైన యాత్ర నేడు కొత్తకోటకు చేరుకుంది. పట్టణంలోని రామభక్తులు, హిందూ వాహిని సభ్యులు మహా పాదయాత్రకు స్వాగతం పలికి రామాలయం వరకు ర్యాలీగా వచ్చారు. సంవత్సరం లోపు రామమందిరం నిర్మాణం చేపట్టాలని ఈ పాదయాత్ర చేస్తున్నట్లు మంజునాథ్ తెలిపారు. రామమందిర నిర్మాణం కోసం పాదయాత్ర ద్వారా 2 ఇటుకలు తీసుకెళ్తున్నామని, గ్రామ గ్రామాన కొలువైన రామ మందిరంలో వీటికి పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఇదీ చూడండి: సేవ్ గర్ల్చైల్డ్ నినాదంతో మట్టి గణపతి దర్శనం