వనపర్తి జిల్లాలోని ప్రతి గ్రామంలో వినాయక చవితి సందడి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 300 విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం, రామాలయం, ఐజయ్యనగర్ కాలనీ, సాయినగర్ కాలనీ, గాంధీనగర్ తదితర ప్రాంతాలలో ఆకర్షణీయంగా ఏర్పాటు చేసిన మండపాల్లో గణపతులను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉత్సవ కమిటీ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు ఆదేశించారు.
ఇవీచూడండి: పరిశుభ్రమైన గ్రామాల్లో విజయదశమి: కేసీఆర్