వనపర్తి జిల్లా పెద్దమందడి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రజలు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. కరోనా టీకా వేసుకోవాలంటూ గ్రామాల్లో సర్పంచ్లు అవగాహన కల్పించడం వల్ల ఒక్కసారిగా ఆస్పత్రులకు క్యూ కట్టారు.
ఒక్కసారిగా ప్రజలు తరలిరావడం వల్ల వారిని వైద్యులు అదుపుచేయలేకపోయారు. అదనంగా మరో మూడు కౌంటర్లు ఏర్పాటు చేసి టీకా వేశాలు. ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని అధికారులు, పోలీసులు కోరారు.
మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులు సైతం టీకా తీసుకునేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చారు.
ఇవీచూడండి: రాష్ట్రంలో కరోనా పంజా.. ఒకేరోజు 2909 కేసులు