వనపర్తి పట్టణంలో పలు కాలనీలు జలమయమయ్యాయి. భారీ వర్షాలకు పట్టణంలోని చెరువులు పొంగిపొర్లుతున్నాయి. తాళ్లచెరువు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పట్టణంలోని శ్వేతా నగర్ కాలనీ, శంకర్గగంజ్, బ్రహ్మం గారి వీధి, శ్రీరామ థియేటర్ ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
వనపర్తి పట్టణ శివార్లలోని వనపర్తి ఖిల్లా గణపురం, పెబ్బేరు వనపర్తి, గోపాల్‌పేటలో రహదారులు జలమయమయ్యాయి. హైదరాబాద్ ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు దాటుతూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అడిషనల్ ఎస్పీ షాకీర్ హుస్సేన్ హెచ్చరించారు. జేరిపోతుల మైసమ్మ వాగులో సోమవారం సాయంత్రం గల్లంతైన ఎద్దుల గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డి గోవిందులు ఆచూకీ ఇంతవరకు దొరకలేదు.
ఇదీ చూడండి: అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం