ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఈ క్రమంలో వనపర్తి జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వానల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. చెరువులు జలకళ సంతరించుకున్నాయి. కొత్తకోట మండలం పామాపురం వద్ద ఊకచెట్టు వాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్‌కు వరద నీరు చేరి అలుగు పారుతోంది.
ఈ సందర్భంగా చెక్‌డ్యామ్ మధ్యలో నిర్మించిన 38 అడుగుల శివుడి విగ్రహం చూపరులను ఆకట్టుకుంటుంది. చాలా రోజుల తర్వాత డ్యామ్ నిండటం వల్ల శివుడి అందాలను చూడటానికి స్థానికులు ఆసక్తి కనబరుస్తున్నారు.