ETV Bharat / state

అకాల వర్షానికి నేలరాలిన మామిడి - Mangos damage in veepanagandla mandal

అకాల వర్షానికి మామిడి కాయలు నేలరాలిన ఘటన వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలో చోటుచేసుకుంది. భారీగా నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.

Ground mango
నేలరాలిన మామిడి
author img

By

Published : Apr 16, 2021, 8:13 PM IST

నేలరాలిన మామిడి

వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలో ఆరుగాలం కష్టపడి పండించిన మామిడి అకాల వర్షంతో నేలరాలింది. మండలంలోని గోవర్ధనగిరి, గోపాలదిన్నె, వీపనగండ్ల, వెలుగొండ గ్రామాల్లో ఈదురు గాలులతో పడిన అకాల వర్షానికి మామిడి నేలరాలింది.

కోత దశకు వచ్చిన మామిడి... గురువారం కురిసిన అకాల వర్షానికి నేలరాలింది. 11 ఎకరాల్లో మామిడి సాగు చేశా. కోతకు వచ్చిన దశలో తీవ్ర నష్టం మిగిలింది. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి.

--- వెంకటకృష్ణారెడ్డి, రైతు

దాదాపుగా 400 ఎకరాల్లో కాయలు రాలిపడ్డాయి. రాలిన మామడికాయలను ఉద్యానవన శాఖ అధికారి విజయ భాస్కర్​ రెడ్డి పరిశీలించారు. నష్టపోయిన పంట వివరాలను సేకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. 400 ఎకరాలలో పంట నేల రాలి పడటం వల్ల భారీ నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గురువారం కురిసిన అకాల వర్షానికి మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వీపనగండ్ల, చెన్నంబావి మండలాల్లో మామిడి రైతులు నష్టపోయారు. నేలరాలిన మామిడిని మార్కెట్​కు తరలిస్తున్నాం. రైతులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటాం.

--- విజయ భాస్కర్ రెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి

ఇదీ చూడండి: 'రాష్ట్రంలో లాక్​డౌన్, కర్ఫ్యూ పెట్టే ఆస్కారం లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.