అండర్-19 ఫుట్ బాల్ పోటీలు రెండో రోజుకు చేరుకున్నాయి. వనపర్తి జిల్లా పెబ్బేరులో జరుగుతోన్న ఈ పోటీల్లో ఉమ్మడి జిల్లాల నుంచి ఒక్కొటి చొప్పున 10 జట్లు పాల్గొన్నాయి. ఇప్పటి వరకు జరిగిన పోటీల్లో విజయం సాధించి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, ఆదిలాబాద్ జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. రేపు సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్లు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను జాతీయ స్థాయికి ఎంపిక చేయనున్నారు.
ఇవీచూడండి: అయోధ్యలో రామమందిరం- ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం