వనపర్తి జిల్లా రామన్‌పాడు జలాశయంలో గల్లంతైన ఆత్మకూరుకి చెందిన మత్స్యకారుడు నాగరాజు శవమై దొరికాడు. ఎప్పట్లాగే ఆగస్టు 19న రామన్‌పాడు జలాశయానికి చేపల వేటకు వెళ్లిన నాగరాజు చీకటి పడినా తిరిగి రాలేదు. అనుమానించిన కుటుంబ సభ్యులు ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఆత్మకూరు జలాశయంలో గల్లంతైనట్టు గుర్తించారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు మరుసటి రోజున రామన్‌పాడు జలాశయంలో శవమై దొరికాడు. పంచనామా చేసిన పోలీసులు నాగరాజు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నాగరాజు మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
ఇవీచూడండి: మానవత్వం చాటుకున్న పోలీసులు