'పంటలు ఎండిపోతున్నాయ్.. చివరి ఆయకట్టు వరకు నీరు ఇవ్వాలి' - తెలంగాణ వార్తలు
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలోని నాలుగు గ్రామాల రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. మండలంలోని చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని కోరారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు.
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలోని కత్తెపల్లి, ఆరేపల్లి, గిరిరావు పల్లి, రేచింతల గ్రామాల అన్నదాతలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. మండలంలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని కోరుతూ పట్టణంలో ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు.
ఎండిపోతున్నాయ్
నాలుగు గ్రామాల్లో మొత్తం సుమారు మూడు వేల ఎకరాలకు పైగా పండిస్తున్నామని... సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. ఐదేళ్ల నుంచి ఈ సాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.
స్పందన
రైతుల సమస్యలపై తహసీల్దార్ స్పందించారు. జిల్లా కలెక్టర్ ద్వారా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్లి అందరికీ సాగు నీరు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఫలితంగా రైతులు ఆందోళన విరమించారు.
ఇదీ చదవండి: అప్పుల బాధ తాళలేక అన్నదాత ఆత్మహత్య!