వనపర్తి జిల్లా అమరచింత పురపాలిక కేంద్రంలోని అమరచింత తండా ఎస్సీ వసతిగృహం సమీపంలో మొసలి సంచారం కలకలం సృష్టించింది. ఆదివారం రాత్రి తండా పక్కనే ఉన్న ఓ కొట్టం వద్ద తండా వాసులకు మొసలి కనిపించింది. వెంటనే స్థానికి పోలీసులకు సమాచారం అందించారు.
తండావాసులంతా కలిసి మొసలిని తాళ్లతో బంధించి స్తంభానికి కట్టేశారు. ఇప్పటి వరకు అటవీశాఖ అధికారులు తండాకి రాకపోవడం వల్ల విద్యార్థులు, తండావాసులు భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక మున్సిపల్ ఛైర్మన్ మంగమ్మ నాగభూషణం గౌడ్ అటవీశాఖ అధికారులకు సంప్రదించి వెంటనే మొసలిని తీసుకెళ్లాలని తెలిపారు.
ఇవీ చూడండి: నమస్తే ట్రంప్: జనసంద్రంలా మోటేరా స్టేడియం