వనపర్తి కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ యాస్మిన్ భాష ప్రారంభించారు. ఈ కంట్రోల్ రూమ్ 24 గంటలపాటు ప్రజలకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
ప్రజలు కరోనా వైరస్‌కు సంబంధించిన ఏదైనా ఫిర్యాదు లేదా సమాచారం కావాలంటే 08545-233525/ 7288064701కు ఫోన్ చేయాలని సూచించారు. ఎవరైనా విదేశాల నుంచి వచ్చి ఇంట్లో నిర్బంధం పాటించని వారి సమాచారాన్ని, నిత్యవసర సరుకులను అధిక ధరలకు అమ్మినా సమాచారాన్ని తెలపాలని చెప్పారు.
ఇదీ చూడిండి: ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ మార్గదర్శకాలివే...