విజయదశమి నాటికి రైతు వేదికల నిర్మాణాలు పూర్తి చేయాలని సర్కారు భావిస్తోంది. వనపర్తి జిల్లా పరిధిలోని 252 గ్రామ పంచాయతీలలో క్లస్టర్లు ఏర్పాటు చేసి క్లస్టర్ కు ఒక రైతు వేదిక చొప్పున 71 రైతు వేదికలను నిర్మాణం చేపట్టారు. రైతు వేదికల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. పలుచోట్ల పునాదులు పూర్తిచేసుకునిపై నిర్మాణాలు జరుగుతుండగా, మరికొన్ని చోట్ల పునాదుల నిర్మాణాలు సాగుతున్నాయి. జిల్లాలో దాతల సహకారంతో మూడు రైతులు వేదికలకు మంత్రి నిరంజన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వీటి నిర్మాణం పూర్తి కావొచ్చింది.
జిల్లాలో దాతల సహకారంతో మూడు రైతు వేదికలు పూర్తి కానున్నాయి. మిగతా 68 రైతు వేదికలు జాతీయ ఉపాధి హామీ నిధులతో నిర్మాణం చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు విజయదశమి నాటికి వీటిని పూర్తిచేసే విధంగా అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.