నీట మునిగిన కేఎల్ఐ మోటర్లను పరిశీలించడానికి వెళ్లిన కాంగ్రెస్ నేతలను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి పాలమూరు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకులు తెల్లవారుజాము నుంచి వనపర్తి బస్‌డిపో ముందు బైఠాయించారు. డిపో ముందు ధర్నా చేపట్టిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కేఎల్ఐ ఎత్తిపోతలలోని పంపులు ముంపునకు గురవడం వల్ల ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారుతుందని, ఇంజినీరింగ్ నిపుణులు హెచ్చరించినా, ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి పథకం అండర్ గ్రౌండ్ పనుల్లో భాగంగా బ్లాస్టింగ్ నిర్వహించడం వల్లే కేఎల్ఐ మోటర్లు మునిగిపోవడానికి కారణమని కాంగ్రెస్ పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షులు శంకర్ ప్రసాద్ విమర్శించారు. భేషరతుగా ప్రజలకు సర్కారుకు క్షమాపణ చెప్పాలన్నారు. అక్రమ అరెస్టులను వారు ఖండిస్తున్నామన్నారు.
ఇదీ చూడండి: మంజీరా నదిలో చిక్కుకున్న నలుగురు మత్స్యకారులు