ETV Bharat / state

భూకబ్జాలపై విచారణ జరిపించాలని సీఎస్​కు​ ఫిర్యాదు - తెలంగాణ వార్తలు

వనపర్తి భూకబ్జాలపై విచారణ జరిపించాలని సీఎస్​ సోమేశ్ కుమార్​కు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఫిర్యాదు చేసింది. జిల్లాలోని ఆక్రమణదారులు, వారికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమాచార హక్కు చట్టం ద్వారా తాజాగా మరొకటి వెలుగులోకి వచ్చిందన్నారు.

letter to cs, wanaparthy
సీఎస్​కు ఫిర్యాదు, వనపర్తి జిల్లా
author img

By

Published : Jun 7, 2021, 12:20 PM IST

వనపర్తి భూకబ్జాలపై విచారణ జరిపించాలని సీఎస్ సోమేశ్ కుమార్​కు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఫిర్యాదు చేసింది. జిల్లాలోని ఆక్రమణదారులు, వారికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ వినతిపత్రం అందజేశారు. జిల్లాకేంద్రం నడిబొడ్డున దేవాదాయ భూమి, పెబ్బేర్ సంతకు సంబంధించిన భూమి ఆక్రమణకు గురైందని పేర్కొన్నారు. ఎన్నోసార్లు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా తాజాగా మరొకటి వెలుగులోకి వచ్చిందన్నారు.

వనపర్తి జిల్లాకేంద్రంలో శ్రీనివాస పూర్ శివారులోని సర్వే నంబర్ 45లోని రెండెకరాల 28 గుంటల (2-28) ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని తెలిపారు. రెవెన్యూ రికార్డ్ ప్రకారం సర్వే నంబర్ 45లో 2-28 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారని... 20 ఏళ్ల నుంచి వనపర్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 45వ సర్వే నంబర్ మీద 65 దస్తావేజుల ద్వారా క్రయవిక్రయాలు జరిగాయన్నారు.

ఈ ప్రభుత్వ భూమితో పాటు సర్వే నంబర్ 197 పట్టా భూమిలోని ఇంటి స్థలాలను కొంతమంది దౌర్జన్యంగా కబ్జా చేశారని ఆరోపించారు. ఈ విషయంపై అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా కలెక్టర్ పట్టించుకోవట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేపట్టాలని కోరారు.

ఇదీ చదవండి: మహిళలూ.. మీపై మీరు శ్రద్ధపెట్టండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.