రేపు జరిగే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు... వనపర్తి కలెక్టర్ యాస్మిన్ బాషా తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయ ఆవరణలో ఎన్నికల సామాగ్రి పంపిణీని పరిశీలించారు.
జిల్లాలో మొత్తం 31 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 21వేల 458 మంది పట్టభద్ర ఓటర్లు ఉన్నారని తెలిపారు. ప్రతి కేంద్రంలోనూ కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలు జరపనున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: ఆ స్కెచ్పెన్తో మాత్రమే ఓటు వేయాలి: ఈసీ