cm kcr met farmers: గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి, అమలవుతున్న పథకాల గురించి ఆయా గ్రామ సర్పంచ్‌లకు, పంటల గురించి రైతులకు.. సీఎం కేసీఆర్ ఫోన్‌చేసి ఆరా తీయడం ఇది వరకు చాలా సార్లు చూశాం. కానీ ఇవాళ వ్యవసాయ క్షేత్రంలో పని చేసుకుంటున్న ఓ రైతును నేరుగా పలకరించిన సీఎం కేసీఆర్ ఆశ్చర్యానికి గురిచేశారు.
cm kcr in rangapur village: సీఎం కేసీఆర్ ఇవాళ జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించారు. ఇటీవల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి తండ్రి వెంకటరామిరెడ్డి మృతి చెందారు. ఈ విషయమై ఎమ్మెల్యేను పరామర్శించడానికి సీఎం కేసీఆర్ వచ్చారు. అనంతరం రోడ్డు మార్గాన హైదరాబాద్‌కు తిరిగి బయలుదేరారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్ మీదుగా వెళ్తండగా.. జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ వ్యవసాయ క్షేత్రం వద్ద సీఎం కాన్వాయ్ నిలిపారు. వ్యవసాయ క్షేత్రంలో సాగవుతున్న మిర్చి, వేరుశనగ పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు. ఎప్పుడూ టీవీలోను, పత్రికల్లోను.. కనిపించే ముఖ్యమంత్రి ఒక్కసారిగా తమ పొలాల్లో కనిపించే సరికి ఆ రైతులు ఆశ్చర్యానికి గురయ్యారు. ముఖ్యమంత్రి ఏమేమి అడిగారు. వాళ్లు ఏమిచెప్పారో వారి మాటల్లోనే.....
సీఎం కేసీఆర్ సార్... మా పొలానికి వచ్చారు. ఈ పంటకు తెగుళ్లు ఎలా ఉంటాయని అడిగారు. ఈ పంటమీద ఎంత మిగులుతుందని అడిగారు.. 20 నుంచి 25వేల రూపాయలు మిగులుతుందని చెప్పాను. పంట దిగుబడి గురించి, తెగుళ్ల గురించి, సాగు విధానం గురించి అడిగారు. వరి వేయొద్దని చెప్పారు. నేను కూడా వేయనని చెప్పాను. పంట మార్పిడి ద్వారా దిగుబడి పెరుగుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మా పొలానికి వచ్చి.. నన్ను పలకరించినందుకు మేము చాలా సంతోషపడుతున్నాను. - మహేశ్వర్ రెడ్డి, రైతు
ఇదీ చూడండి: CM KCR gadwal Tour: ఎమ్మెల్యేకి కేసీఆర్ పరామర్శ.. రంగాపూర్‌లో రైతులతో ముచ్చట