ETV Bharat / state

మరో రోమన్ చక్రవర్తిలా ముఖ్యమంత్రి కేసీఆర్: భట్టి

ఆసుపత్రుల సందర్శనలో భాగంగా... సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వనపర్తి జిల్లా ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. కరోనా రోగులకు అందిస్తున్న సేవలు, ఆసుపత్రిలో వైద్యుల, సిబ్బంది ఖాళీల వివరాలు తెలుసుకున్నారు.

clp leader bhatti vikramarka fire on cm kcr in wanaparthy
మరో రోమన్ చక్రవర్తిలా ముఖ్యమంత్రి కేసీఆర్: భట్టి
author img

By

Published : Sep 1, 2020, 6:55 AM IST

రోమన్ తగలబడుతుంటే ఆ దేశ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా మన రాష్ట్రంలో... ముఖ్యమంత్రి కేసీఆర్​ పరిపాలన కొనసాగుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సందర్శనలో భాగంగా... వనపర్తి జిల్లా ఆసుపత్రిలోని కరోనా బాధితుల ఐసోలేషన్ వార్డును సందర్శించి పరిశీలించారు. వైద్యులతో మాట్లాడి ఆసుపత్రిలోని... కోవిడ్ విభాగం నిర్వహణ, ఖాళీ పోస్టుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పేదలు ఆరోగ్య సేవలు పొందేందుకు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఆసుపత్రులు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కేవలం పేరుకు మాత్రమే కొనసాగుతున్నాయన్నాని విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో వైద్యులు లేరని తెలిపారు. ఆరోగ్య శాఖ మంత్రి కేవలం ఒక విగ్రహంలా పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వాలు కల్పించిన వసతులు తప్ప... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు.

ఇదీ చూడండి: నేడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎల్పీ బృందం పర్యటన

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.