వనపర్తి జిల్లా వనపర్తి రోడ్ రైల్వేస్టేషన్ ఎదుట రైల్వే ప్రైవేటీకరణను ఆపాలని సీఐటీయూతో పాటు పలు సంఘాల జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకొని రైల్వే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినదించారు. 1853లో ప్రారంభించిన రైల్వేను నేడు ప్రైవేటీకరణ చేయడం అన్యాయం అన్నారు.
మోదీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టేందుకే ఈ ప్రైవేటీకరణ చేపట్టిందని వారు ఆరోపించారు. దేశ ప్రజలు ప్రభుత్వ రంగ రైల్వే వ్యవస్థను కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శులు పి.శ్రీహరి, ఆర్.ఎన్.రమేష్, మండల కన్వీనర్ నాగరాజు, నాయకులు ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: చిరు వ్యాపారులకు రుణాలు.. పత్రాలు అందించిన హరీశ్‌రావు