కార్మిక చట్టాల రద్దు, సవరణలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ వనపర్తి జిల్లా కలెక్టరేట్ ముందు సీఐటీయూ, ఐఎఫ్టీయూల ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. కార్మికుల పని గంటలను 8 నుంచి 12 గంటల వరకు పెంచే యోచనను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా మారుస్తోందని ఆరోపించారు. 134 ఏళ్ల క్రితం పోరాడి సాధించుకున్న 8 గంటల పనిదినం 12 గంటలకు పెంచడం సరికాదన్నారు.
20 లక్షల కోట్ల కేంద్ర ప్యాకేజీ పచ్చి మోసమని కార్మిక నాయకులు విమర్శించారు. పేదలకు కేవలం 2.50 లక్షల కోట్లు మాత్రమే కేటాయించారని వెల్లడించారు. వారం క్రితం కోటీశ్వరులకు చెందిన 69 వేల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసిన కేంద్రం, ప్రతి పేద కుటుంబానికి నెలకు కరోనా కష్టకాలంలో 7,500 రూపాయల నగదు ఇవ్వాలని పోరాడుతున్నా ఇవ్వడం లేదని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ఎలుగుబంటి బీభత్సం.. చంపేసిన గ్రామస్థులు