వనపర్తి జిల్లా అమరచింతలో ఆజ్మెర్ దర్గా ఉర్సు ఘనంగా నిర్వహించారు. రాజావలి దర్గా నుంచి మహబూబ్ సుభాని దర్గా వరకు చాదర్ ఊరేగించారు. అమరచింతను మున్సిపాలిటీగా ఏర్పాటు చేసినందుకు చాదర్ సమర్పించి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ మంగమ్మ నాగభూషణం గౌడ్, కమిషనర్ జెకె. మోహన్, తహసీల్దారు నదీబ్ అహ్మద్, చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు నజీర్, కార్యదర్శి అన్సార్, సభ్యులు అయ్యూబ్, ఇస్మాయిల్, నయర్, ఖాజా, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'అక్రమ నిర్మాణాలు తొలగించాలంటే అరెస్టులా?'