ఏరువాక పౌర్ణమి సందర్భంగా వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం చిన్న మందడిలోని 20 మంది రైతులను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సన్మానించారు. తన దత్తత గ్రామమైన చిన్న మందడి మొదటి నుంచి అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని నేటి నుంచి ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు.
గ్రామంలోని ఓ రైతు పొలంలో నాగలి దున్ని వ్యవసాయ కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు పూజోత్సవం సన్మాన సభ కార్యక్రమంలో పాల్గొని రైతులను సన్మానించారు. యువత వ్యవసాయం వైపు మొగ్గు చూపితే నూతన పద్ధతిలో వ్యవసాయం చేపట్టి ప్రపంచానికే ఆదర్శంగా నిలవచ్చని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.
ఇవీ చూడండి: మీ ఇంట్లోనే కరోనా చికిత్స.. వైరస్ నుంచి బయటపడే మార్గం