ETV Bharat / state

'గాంధీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం' - BJP DK ARUNA GANDHI SANKALPA YATRA in Kothakota

వనపర్తి జిల్లా కొత్తకోటలో భాజపా ఆధ్వర్యంలో సంకల్ప యాత్ర ప్రారంభించారు. మాజీమంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.

'గాంధీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం'
author img

By

Published : Nov 3, 2019, 11:37 PM IST

'గాంధీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం'

గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందనే గాంధీ నినాదాన్ని అనుసరించి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్ 2 నుంచి ప్రతి పార్లమెంట్​ పరిధిలో 150 కిలోమీటర్ల మేర సంకల్పయాత్రను మొదలుపెట్టారు. ఇవాళ వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో నిర్వహించిన యాత్రలో మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. వీధుల గుండా తిరుగుతూ గాంధీజీ ఆశయాలు అయినా స్వచ్ఛత, పరిశుభ్రత అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లటం జరిగిందని డీకే అరుణ వెల్లడించారు.

'గాంధీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం'

గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందనే గాంధీ నినాదాన్ని అనుసరించి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్ 2 నుంచి ప్రతి పార్లమెంట్​ పరిధిలో 150 కిలోమీటర్ల మేర సంకల్పయాత్రను మొదలుపెట్టారు. ఇవాళ వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో నిర్వహించిన యాత్రలో మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. వీధుల గుండా తిరుగుతూ గాంధీజీ ఆశయాలు అయినా స్వచ్ఛత, పరిశుభ్రత అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లటం జరిగిందని డీకే అరుణ వెల్లడించారు.

Intro: వనపర్తి జిల్లా ,కొత్తకోట పట్టణ కేంద్రంలో, గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని బిజెపి ఆధ్వర్యంలో చేపట్టిన సంకల్ప యాత్రలో డీకే అరుణ , ఏపీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.


Body:వనపర్తి జిల్లా ,కొత్తకోట పట్టణ కేంద్రంలో, గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని బిజెపి ఆధ్వర్యంలో చేపట్టిన సంకల్ప యాత్రలో డీకే అరుణ , ఏపీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.
గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందనే గాంధీ నినాదాన్ని అనుసరించి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్ 2 నుండి ప్రతి పార్లమెంటు పరిధిలో 150 కిలోమీటర్లు సంకల్ప యాత్ర చేపట్టడం జరిగిందని డీకే అరుణ తెలిపారు.
దీనిలో భాగంగానే కొత్తకోట పట్టణంలో అన్ని వీధుల గుండా పాదయాత్ర చేపట్టడం జరిగిందని తెలిపారు. వీధుల గుండా తిరుగుతూ గాంధీజీ ఆశయాలు అయినా స్వచ్ఛత, పరిశుభ్రత ప్లాస్టిక్ వినియోగించకూడదు అనేటటువంటి అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఆమె తెలిపారు.
గత ఆరు సంవత్సరాల నుండి రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో మరియు పట్టణాలలో పారిశుద్ధ్యం పడకకేసిందని , ఆరు సంవత్సరాలు చేయాల్సిన పారిశుద్ధ్యాన్ని 30 రోజులు గ్రామాలలో వారం రోజులు పట్టణాలలో చేస్తున్నారని దుయ్యబట్టారు. మళ్లీ ఆరు సంవత్సరాల వరకు పారిశుద్ధ్య పనులు చేయరేమో అని వాపోయారు.
గ్రామ పరిశుభ్రత అనేది సంవత్సరం మొత్తం నిరంతరంగా కొనసాగాల్సిన ప్రక్రియ అని ,దీన్ని కొన్ని రోజులకే పరిమితం చేయడం తగదని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి రైతు రుణమాఫీ ఇప్పటివరకు ఒక్క రైతుకు కూడా చేయలేదని , రైతుబంధు పథకం బంద్ అయ్యేలా కనపడుతుందని తెలిపారు.
గ్రామాలకు గాని , మున్సిపాలిటీలకు గాని గత ఆరు సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు కేటాయించలేదని , పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను ఉపయోగిస్తూ వాటిని కూడా పక్కదారి పట్టిస్తున్నారని తెలిపారు.
రూపాయికి కిలో బియ్యం లో కూడా 30 రూపాయల దాకా కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం రెండు రూపాయలు మాత్రమే భరిస్తుందని తెలిపారు.
రాష్ట్రంలో రెండు పడక గదుల నిర్మాణాలు ఊసే లేదని వాపోయారు.



Conclusion:కిట్ నెంబర్1269,
పి నవీన్,
9966071291.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.