ETV Bharat / state

Bandi Sanjay on KCR: 'తెరాస తోక పార్టీ.. కేసీఆర్ మాటలు నమ్మొద్దు' - అమరచింతలో బండి సంజయ్ పాదయాత్ర

Bandi Sanjay Comments on KCR: పెట్రోల్, డీజిల్ ధరలపై మాట్లాడే హక్కు తెరాసకు లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. దేశంలోనే తెలంగాణలో పెట్రో ధరలు అత్యధికమని తెలిపారు. కేసీఆర్ పోరాట ఫలితంగానే బండి సంజయ్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఎదురుదాడి చేశారు. భాష, యాస పేరుతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్‌ను నమ్మొద్దని ప్రజలకు సూచించారు.

Bandi Sanjay on KCR
Bandi Sanjay on KCR
author img

By

Published : Apr 23, 2022, 12:29 PM IST

Bandi Sanjay Comments on KCR: కేసీఆర్‌ పోరాట ఫలితంగానే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడన్న కేటీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్‌ ఎదురుదాడి చేశారు. తాను రాష్ట్రానికి చెందిన పార్టీకి అధ్యక్షుడిని కాదని.. దశాబ్దాల కాలంనాటి జాతీయ పార్టీలో నాయకుడినని చెప్పారు. ప్రజాసంగ్రామయాత్రలో భాగంగా వనపర్తి జిల్లా అమరచింత మండలంలో పాదయాత్ర చేస్తున్న బండి.. ఇవాళ పదోరోజు కిష్టంపల్లె స్టేజి వద్ద 100 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు.

కేసీఆర్‌ను నమ్మొద్దు : 100 కిలోమీటర్ల పూర్తి చేసుకున్న సందర్భంగా బండి సంజయ్..కేక్‌ కట్‌ చేసి.. తన వెంట నడుస్తున్న శ్రేణులకు అభినందనలు తెలిపారు. తెరాసను తోక పార్టీగా పేర్కొన్న.. ఇతర పార్టీలపై ఆధారపడే మనుగడ సాధిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్‌ తుంగలో తొక్కి.. పేదప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. భాష, యాస పేరుతో ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తున్న కేసీఆర్‌ మాటలను నమ్మవద్దని ఆయన సూచించారు.

"పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై మాట్లాడే అర్హత తెరాసకు లేదు. దేశంలో తెలంగాణలోనే పెట్రో ధరలు అత్యధికం. చమురుపై కేంద్రం 2 సార్లు ఎక్సైజ్‌ సుంకం తగ్గించింది. 18 రాష్ట్రాలు తాము విధించే పన్నులను తగ్గించాయి. తెలంగాణ ప్రభుత్వం నయా పైస తగ్గించలేదు. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక వ్యాట్‌ 4 శాతం పెంచారు. రాష్ట్రంలో వ్యాట్‌ పేరుతో లీటర్‌కు రూ.35 వసూలు చేస్తున్నారు."

- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

తెరాస తోక పార్టీ.. కేసీఆర్ మాటలు నమ్మొద్దు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.